
అధైర్యపడొద్దు.. అండగా ఉంటా
కార్యకర్త సురేశ్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి దామోదర
వట్‌పల్లి(అందోల్): కాంగ్రెస్ కార్యకర్త తలారి సురేశ్ మరణం అతని కుటుంబానికే కాదు.. పార్టీకే తీరని లోటని, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ అన్నారు. మండల పరిధిలోని మేడికుందా గ్రామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు తలారి సురేశ్ అనారోగ్యానికి గురై శనివారం మృతి చెందాడు. విషయం తెలిసిన మంత్రి ఆదివారం మృతుని ఇంటికి వెళ్లి సురేశ్ మృతిపట్ల నివాళులర్పించి మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుని తల్లిదండ్రులు, భార్య పిల్లలను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.