
మతోన్మాద శక్తుల అభివృద్ధే బీజేపీ ధ్యేయం
సంగారెడ్డి ఎడ్యుకేషన్: కార్పొరేట్, మతోన్మాద శక్తుల అభివృద్ధే బీజేపీ ధ్యేయమని, ప్రజా సంక్షేమం మరిచి ప్రజల మధ్య విద్వేషాలను పెంచడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు పేర్కొన్నారు. సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్‌లో సీపీఎం సంగారెడ్డి, మెదక్ జిల్లా నాయకత్వ స్థాయి శిక్షణ తరగతులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం చుక్కా రాములు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక వర్గాలకు వ్యతరేకంగా చట్టాలను రూపొందిస్తూ, కార్పొరేట్ శక్తులకు ప్రయోజనాలు చేకూరేలా వ్యవహారిస్తోందని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత, గిరిజనుల మీద దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రాజ్యాంగపరంగా దక్కాల్సిన రిజర్వేషన్లను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్యం, రాజయ్య, సాయిలు, రాంచందర్, నర్సింహులు, జిల్లా కమిటీ సభ్యులు ప్రవీణ్, రేవంత్, నాగేశ్వర్ రావు, మహిపాల్, యాదగిరి పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు చుక్కా రాములు