ఖేడ్ డీఎంకు ప్రజలు వినతి
న్యాల్‌కల్(జహీరాబాద్): మండల పరిధిలోని న్యాల్‌కల్, అత్నూర్, డప్పూర్, వడ్డి, శంశల్లా పూర్ మీదుగా బీదర్‌కు బస్సు సర్వీస్‌ను నడిపించాలని వడ్డి గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వివేకానంద సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఆనందేశ్వర్ ఆధ్వర్యంలో పలువురు గ్రామస్తులు శుక్రవారం ఉదయం ఖేడ్‌కు తరలి వెళ్లి డిపో మేనేజర్ మల్లేశయ్యకు వినతి పత్రం అందజేశారు.
సామూహిక అక్షరాభ్యాసం
న్యాల్‌కల్(జహీరాబాద్): మండల పరిధిలోని హద్నూర్, న్యామతాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. బాడి బాట కార్యక్రమంలో భాగంగా ఆయా పాఠశాలల్లో ఎంఈఓ మారుతి రాథోడ్, ఉపాధ్యాయులు 1వ తరగతిలో చేరిన చిన్నారుల చేత అక్షరాలు దిద్దించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ...ప్రభుత్వ బడుల్లో ఉచిత విద్యతోపాటు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, మధ్యాహ్నం భోజనం తదితరాలు అందిస్తున్నందున పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని తల్లిదండ్రులను కోరారు.


