
ఖేడ్‌లో కుండపోత వర్షం
నారాయణఖేడ్/కల్హేర్(నారాయణఖేడ్) : నారాయణఖేడ్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో సాయంత్రం సమయంలో ఖేడ్‌తోపాటు కల్హేర్, సిర్గాపూర్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. కల్హేర్, మార్డి, బీబీపేట్, కృష్ణాపూర్, బోక్కస్‌గాం, నల్లవాగు, తదితర చోట్ల కూడా కుండపోత వర్షం పడింది. వర్షం వల్ల జనజీవనం స్తంభించింది. ఖేడ్ పట్టణంలో రహదారులపైనుంచి వరదనీరు భారీగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. నాగల్‌గిద్ద మండలంలో 49 మి.మీ, మనూరులో 48.3, నారాయణఖేడ్‌లో 43.3మి.మీ వర్షం కురిసింది