
అందుబాటులోనే సరిపడా విత్తనాలు
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్
సంగారెడ్డి టౌన్: రాబోయే వర్షాకాలంలో రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులోనే ఉన్నాయని ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ పేర్కొన్నారు. సంగారెడ్డి మండలంలోని రైతు వేదిక నుంచి మంగళవారం ‘రైతు నేస్తం’కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...జిల్లాలో జీలుగా, జనుము విత్తనాల కొరత లేదని పేర్కొన్నారు. పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. రైతులు అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
మునిపల్లి(అందోల్): లింగంపల్లి గురుకుల పాఠశాల, కళాశాలలో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు విద్యా బోధనకు అతిథి అధ్యాపక పోస్టులు ఖాళీలున్నాయని ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపాల్ సురభి చైతన్య మంగళవానం ఓ ప్రకటనలో వెల్లడించారు. తెలుగు 2, హిందీ, ఇంగ్లిష్ 2, మ్యాథ్స్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, స్కూల్‌లో బోధనకు పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
కేపీఎస్‌తోనే
కార్మికుల సంక్షేమం
కేపీఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): కార్మికుల సంక్షేమం,అభివృద్ధి కార్మిక పోరాట సమితి(కేపీఎస్)తోనే సాధ్యమని ఆ సంఘం అధ్యక్షుడు కొత్తగొల్ల చంద్రశేఖర్ పేర్కొన్నారు. మండలంలోని ఎంఆర్‌ఎఫ్ పరిశ్రమ వద్ద మంగళవారం నిర్వహించిన గేట్ మీటింగ్ సమావేశానికి హాజరై కార్మికులనుద్దేశించి మాట్లాడుతూ... కార్మికులకు చట్టబద్ధమైన ఉద్యోగ భద్రత, స్వేచ్ఛ కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఈనెల 28న జరిగే యూనియన్ ఎన్నికల్లో పులి గుర్తుకు ఓటేసి కేపీఎస్ యూనియన్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. కార్మికులకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా నని హామీనిచ్చారు. మెరుగైన మెడికల్ పాల సీని అమలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు విష్ణువర్థన్‌రెడ్డి, విఠల్, కిరణ్, కార్మికులు పాల్గొన్నారు.
ఐఎన్‌టీయూసీని గెలిపించాలి
జహీరాబాద్: మహీంద్ర అండ్ మహీంద్ర కర్మాగారంలో త్వరలో జరగనున్న కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీని భారీ మెజార్టీతో గెలిపించాలని సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.గిరిధర్‌రెడ్డి కార్మికులను కోరారు. సీఐటీయూ కార్మిక సంఘానికి చెందిన 25 మంది కార్మికులకు కండువాలు కప్పి ఐఎన్‌టీయూసీ యూనియన్‌లో చేర్చుకున్నారు. అనంతరం తన క్యాంపు కార్యాలయం వద్ద మంగళవారం నిర్వహించిన సమావేశంలో గిరిధర్‌రెడ్డి మాట్లాడుతూ.. మహీంద్రలో జరగనున్న కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీని బలపరిస్తే కార్మికులకు మంచి వేతన ఒప్పందం ఇప్పించేలా కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, సీడీసీ చైర్మన్ ముబీన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి, మహీంద్ర కర్మాగారం ఐఎన్‌టీయూసీ నాయకులు శివకుమార్, అశోక్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, సంపత్, కార్మికులు పాల్గొన్నారు.
డీఎస్‌ఆర్ యాప్‌ను
ఉపసంహరించుకోవాలి
కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహులు
నారాయణఖేడ్: ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల కోసం తీసుకొచ్చిన డీఎస్‌ఆర్ యాప్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొఠారి నర్సింహులు డిమా ండ్ చేశారు. ఈ మేరకు సంఘనాయకులతో కలిసి మంగళవారం ఖేడ్ ఇన్‌చార్జి తహసీల్దార్ రాజుపటేల్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ కార్యాలయానికి వచ్చిన తర్వాతే ఇతర పనులు పెట్టుకోవాలని, థంబ్ వేసి యాప్ సహాయంతో ఇంటింటికీ తిరిగి చెత్త కొలతలు తీయాలని ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. కార్య దర్శులకు ఇప్పటికే రేషన్ కార్డులు, గృహనిర్మాణం, ఉపాధిహామీ, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా తదితర పనులకోసం ఆయాశాఖల కార్యాలయాలకు తిరుగుతూ గ్రామాల్లో పర్యవేక్షణ పనులు భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. వినతిపత్రం అందజేసినవారిలో నాయకులు రఘు, బస్వరాజ్, రమేశ్ ఉన్నారు.