
సర్వేయర్ల శిక్షణకు సర్వం సిద్ధం
పోచారం.. వన విజ్ఞానంఅడవులపై అవగాహన కల్పించేందుకు విద్యార్థుల కోసం వన విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేశారు. వివరాలు 8లో u
● నేటి నుంచి 50 రోజులపాటులైసెన్స్‌డ్ సర్వేయర్లకు ట్రైనింగ్ ● సమాఖ్య భవనంలో ప్రారంభించనున్నకలెక్టర్ క్రాంతి ● జిల్లాలో 166మంది ఎంపిక
ఎరువుల మోతాదు మించొద్దు
పత్తి పంట సాగులో మోతాదుకు మించి ఎరువులు వినియోగించవద్దని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. వివరాలు 9లో u
సోమవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2025
సంగారెడ్డి జోన్: ప్రభుత్వ సర్వేయర్ల కొరత దృష్ట్యా లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భూ భారతి చట్టంలో రిజిస్ట్రేషన్ల సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి అనే నిబంధన ఉండటంతో రాష్ట్రంలోని భూములన్నీ సర్వే చేసి మ్యాప్‌లు రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సరిపడా సిబ్బంది లేని నేపథ్యంలో లైసెన్స్‌డ్ సర్వేయర్లతో భూ సర్వే చేయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగానే లైసెన్స్‌డ్ సర్వేయర్లను ఎంపిక చేసింది. ఈనెల 17వ తేదీ వరకు లైసెన్స్‌డ్ సర్వేయర్ల కోసం మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం జిల్లాలో 166మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను అధికారులు ఎంపిక చేశారు. వీరికి ఈనెల 26నుంచి 50రోజులపాటు శిక్షణనివ్వనున్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ భవనంలో ప్రధానంగా థియరీ, టిప్పున్ ప్లాటింగ్, ఫీల్డ్ అంశాలను లైసెన్స్‌డ్ సర్వేయర్లకు అధికారులు బోధించనున్నారు. ఎంపికై న వారి వివరాలను అధికారులు ఇప్పటికే విడుదల చేశారు. శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టర్ వల్లూరు క్రాంతి జిల్లా సమాఖ్య భవనంలో ప్రారంభించనున్నారు. శిక్షణ అనంతరం 42 రోజులపాటు క్షేత్రస్థాయిలో, సర్వేయర్ కింద శిక్షణనివ్వనున్నారు. అందులో విజయవంతంగా శిక్షణ పూర్తిచేసిన వారికి రాష్ట్రస్థాయిలో పరీక్ష నిర్వహించనున్నారు.
ఏర్పాట్లు పూర్తి
లైసెన్స్‌డ్ సర్వేయర్ల శిక్షణ కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జిల్లాలో ఎంపికై న 166 మందికి సోమవారం నుంచి శిక్షణ ఉంటుంది. శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ క్రాంతి ప్రారంభిస్తారు.
ఐనేష్, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్,
సంగారెడ్డి
న్యూస్‌రీల్

సర్వేయర్ల శిక్షణకు సర్వం సిద్ధం