పాపన్నపేట(మెదక్): ఏడుపాయల్లో గుర్తు తెలియ ని ఓ వ్యక్తి నీట మునిగి మృతి చెందాడు. ఏఎస్‌ఐ గాలయ్య కథనం మేరకు.. దుర్గమ్మ ఆలయం ముందు ఉన్న మంజీరా పాయల వద్దకు సుమారు 55 నుంచి 60 ఏళ్ల వయస్సున్న గుర్తు తెలియని వ్యక్తి వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు నీట మునిగాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆలయ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి బయటికి తీసి చూడగా అప్పటికే మృతి చెందాడు.
మృతుడి ఒంటిపై బ్రౌన్ కలర్ నిక్కర్ మాత్రమే ఉందని, మద్యం మత్తులో స్నానానికి వెళ్లి నీట మునిగి ఉంటాడని అనుమానిస్తున్నారు. మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే 87126 57920 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.