
భూసమస్యలకు భూ భారతితో చెక్
● పది ఫలితాల్లో 99.09 ఉత్తీర్ణత శాతం ● ఉత్తీర్ణతలో బాలికల హవా
● కలెక్టర్ వల్లూరు క్రాంతి ● ఉమ్మడి జిన్నారం మండలాల్లోఅవగాహన సదస్సు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: పదోతరగతి ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. పరీక్షలు సమీపిస్తున్న సమయంలో ఒక్కో పాఠశాలను ఒక్కో జిల్లా అధికారికి దత్తత ఇవ్వడంతో ఈసారి మంచి ఫలితాలు వచ్చాయి. పదో తరగతి ఫలితాలలో 99.09 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచింది. జిల్లావ్యాప్తంగా 22,374 మంది పరీక్షలు రాయగా 22,170 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 11,663 మంది బాలురకుగానూ 11,538 ఉత్తీర్ణత సాధించగా 125మంది బాలురు మాత్రమే ఫెయిల్ అయ్యారు. అదేవిధంగా 10,711 మంది బాలికలకుగానూ 10.632మంది ఉత్తీర్ణత సాధించగా 79మంది బాలికల ఫెయిల్ అయ్యారు. బాలుర ఉత్తీర్ణత శాతం 98.93 కాగా, బాలికల శాతం 99.26గా నమోదైంది. మునిపల్లి మండలం కంకోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి వర్షిక 590 మార్కులు సాధించి జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా కంది మండలం చేర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి వడ్ల గాయత్రి 588 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో అందోల్ గురుకుల పాఠశాల విద్యార్థి మంగళి రిషిత, కంది మండలం చెర్యాల ఉన్నత పాఠశాల విద్యార్థి దృషిక 586 మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచారు. వీరితో పాటు జిల్లాలో 13 మంది విద్యార్థులు 580కి పైగా మార్కులు సాధించారు.
368 ప్రభుత్వ పాఠశాలల్లో
నూటికి నూరు
జిల్లావ్యాప్తంగా మొత్తం ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు 467 గానూ 368 పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించాయి. వీటిలో 158 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా 149 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వంద శాతం ఫలితాలు సాధించిన పాఠశాలలో 149 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 08 మోడల్ స్కూల్, 16 కస్తూర్బా పాఠశాలలు, రెండు గురుకుల పాఠశాల, ఎనిమిది బీసీ వెల్ఫేర్ పాఠశాలలు, 10 సోషల్ వెల్ఫేర్, ఆరు ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు, రెండు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు, 9 మైనార్టీ గురుకుల పాఠశాలలున్నాయి.
తృతీయ స్థానంలో నిలిచిన చేర్యాల
జెడ్పీహెచ్ పాఠశాల విద్యార్థి దృషికకు మిఠాయి తినిపిస్తున్న తండ్రి
రెండు వారాల
దగ్గును నిర్లక్ష్యం చేయకండి
జిల్లా టీబీ నియంత్రణ అధికారి డా.అరుణ
నారాయణఖేడ్: రెండు వారాల పాటు దగ్గుతో బాధపడుతుంటే క్షయవ్యాధి లక్షణాలకు సంకేతాలని అందువల్ల అలాంటి వారు నిర్లక్ష్యం చేయకుండా సమీప ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో తెమడ పరీక్ష చేయించుకోవాలని జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ అరుణ సూచించారు. క్షయవ్యాధి నివారణకు సంబంధించిన సమాచారంతో కూడిన కరపత్రాలను బుధవారం ఖేడ్‌లో ఆమె స్థానిక ఎమ్మెల్యే డా.సంజీవరెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...క్షయవ్యాధి పట్ల భయపడాల్సిన అవసరంలేదన్నారు. సకాలంలో మందులు వాడితే నయమవుతుందని తెలిపారు.
జిన్నారం (పటాన్‌చెరు): నిర్ణీత గడువులోపు భూభారతి చట్టంతో సమస్యలు పరిష్కరించవచ్చని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. ఉమ్మడి జిన్నారం గుమ్మడిదల మండలాల్లో బుధవారం ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. రెవెన్యూ వ్యవస్థ మరింత బలోపేతం చేసేందుకు ప్రతీ గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను ప్రభుత్వం నియమించనుందన్నారు. పెండింగ్‌లో ఉన్న సాదాబైనామాలకు పరిష్కారం లభించనుందని తెలిపారు. గ్రామాల్లోని రైతులకు భూసమస్యలపై ఉన్న అనుమానాలను నివృతి చేసేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని వివరించారు. ఆధార్ తరహాలోనే భూముల వివరాలతో కూడిన భూదార్ నంబర్‌ను కేటాయిస్తామని తెలిపారు. అర్హులైన రైతులు ఈ చట్టంపై అవగాహన పెంపొందించుకుని భూ సమస్యలు ఉంటే గ్రామసభలో అధికారులకు అర్జీలు అందించి పరిష్కరించుకోవాలని ధరణి పోర్టల్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌డీవో రవీందర్‌రెడ్డి, తహసీల్దార్‌లు భిక్షపతి, పరమేశం, ఆర్‌ఐలు జయప్రకాశ్ నారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, ఆత్మకమిటీ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలను పరిశీలన..
జిన్నారం మండల కేంద్రంలోని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ వల్లూరు క్రాంతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గోనె సంచుల కొరత లేకుండా కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలన్నారు. హమాలీల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు ధాన్యాన్ని ఎక్కువ రోజులు కేంద్రాల వద్ద నిల్వచేయవద్దని నిర్వాహకులకు సూచించారు.
695
1,98,154
రూ.911 కోట్లు
దత్తత తీసుకోవడంతోనే..
పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా మంత్రి, ఇన్‌చార్జి మంత్రుల పర్యవేక్షణలో ఒక్కో పాఠశాలకు ఒక్కో జిల్లా అధికారిని కేటాయించాం. దీంతో సంబంధిత అధికారులు ఆయా గ్రామాలకు పర్యటనలకు వెళ్లినప్పుడు పాఠశాలలను సందర్శించడం, ఎప్పటికప్పుడు ప్రధానోపాధ్యాయులతో రివ్యూ మీటింగ్‌లను ఏర్పాటు చేయడంతో పాటు క్రమం తప్పకుండా పరీక్షలను నిర్వహించడం వలనే ఇంతటి ఫలితాలు సాధ్యమయ్యాయి. రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలలో జిల్లా రెండవ స్థానంలో నిలవడం చాలా గర్వంగా ఉంది.
– వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి

భూసమస్యలకు భూ భారతితో చెక్

భూసమస్యలకు భూ భారతితో చెక్

భూసమస్యలకు భూ భారతితో చెక్

భూసమస్యలకు భూ భారతితో చెక్