
తల్లీకూతురు అదృశ్యం
పటాన్‌చెరు టౌన్: తల్లీకూతురు అదృశ్యమైన ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ కోటేశ్వర్ రావు కథనం మేరకు.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సమీర్ రాణా బతుకుదెరువు కోసం రెండు నెలల కిందట వచ్చి పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ మంజీరా స్కూల్ సమీపంలో ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 26న డ్యూటీకి వెళ్లిన సమీర్ రాణా రాత్రి ఇంటికి వచ్చి చూసేసరికి భార్య కీయా రాణా, కూతురు సేయా(6) కనిపించలేదు. స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. భార్య, కూతురి అదృశంపై భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు.
నా భర్త ఆచూకీ తెలపండి
హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని శమ్నాపూర్ గ్రామానికి చెందిన మైలి శ్రీను 16 నుంచి నుంచి కనిపించడం లేదని, తెలిస్తే ఆచూకీ తెలపాలని అతడి భార్య లత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎవరైనా ఆచూకీ లభిస్తే హవేళిఘణాపూర్ పోలీసులకు సమాచారం అందించాలని ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.

తల్లీకూతురు అదృశ్యం

తల్లీకూతురు అదృశ్యం