
నమాజ్ కోసం వెళ్లి బాలుడు అదృశ్యం
పటాన్‌చెరు టౌన్: బాలుడు అదృశ్యమైన ఘటన పటాన్ చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చేసుకుంది. ఎస్‌ఐ కోటేశ్వరరావు కథనం మేరకు.. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్‌కి చెందిన హమీద్(11) శనివారం నమాజ్‌కి వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బాలుడి కోసం తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. బాలుడి అదృశ్యంపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇంటి నుంచి వెళ్లి మహిళ
శివ్వంపేట(నర్సాపూర్): మహిళ అదృమైన ఘటన మండల పరిధి చండీ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి కథ నం మేరకు.. గ్రామానికి చెందిన సందిగాని కల్యాణికి ఆరేళ్ల కిందట వివా హం జరిగింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఏడాదిగా చండీ గ్రామంలోని అమ్మగారి ఇంటి వద్ద ఉంటుంది. 26న ఇంటి నుంచి బయటకు వెళ్లిన కల్యాణి తిరిగిరాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గ్రామ పరిసరాలు, బంధువులు, స్నేహితుల వద్ద వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో ఆదివారం తండ్రి రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

నమాజ్ కోసం వెళ్లి బాలుడు అదృశ్యం