
ఈతకెళ్లి నీట మునిగి యువకుడు మృతి
మద్దూరు(హుస్నాబాద్): ఈతకు వెళ్లి బావిలో మునిగి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని సలాఖపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. చేర్యాల పట్టణంలోని పెద్దమ్మగడ్డకు చెందిన బింగి అఖిల్(19) మండలంలోని మర్మాముల గ్రామంలో బంధువుల ఇంట్లో జరుగుతున్న పండుగకు వచ్చాడు. శనివారం ఉదయం మర్మాముల పక్క గ్రామమైన సలాఖపూర్ గ్రామంలోని గూడ శ్రీనివాస్‌రెడ్డి రైతుకు చెందిన వ్యవసాయ బావిలోకి బంధువులతో కలిసి ఈతకు వెళ్లాడు. ఈత సరిగా రాక నీట మునిగాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ షేక్ మహబూబ్ ఘటనా స్థలానికి చేరుకొని గజతగాళ్ల సాయంతో అఖిల్ మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.