
పౌష్టికాహారంతోనే పిల్లల ఎదుగుదల
దౌల్తాబాద్(దుబ్బాక): పిల్లల ఎదుగుదలకు పౌష్టికాహారం చాలా ముఖ్యమని తహసీల్దార్ చంద్రశేఖర్, సీడీపీవో ఎల్లయ్య చెప్పారు. స్థానిక అంగన్‌వాడీ చిన్నారుల గ్రాడ్యుయేషన్ డేను ఏఆర్ గార్డెన్స్‌లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదేళ్లలోపు పిల్లలను తప్పనిసరిగా అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించాలన్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎంపీడీఓ వెంకటలక్ష్మ మ్మ, మెడికల్ ఆఫీసర్ నాగరాజు, రిలయన్స్ జిల్లా కోఆర్డినేటర్ రాజలింగం, పోషణ్ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ వెంకటప్రసాద్, బ్లాక్ కోఆర్డినేటర్ శాంసన్, రిలయన్స్ ప్రతినిధులు భాస్కర్, సరిత, నాగరాజు సూపర్‌వైజర్ గిరిజ, చంద్రకళ, అంతుల్, రేణుక, స్వరూప, రాజేశ్వరి, గీత తదితరులు పాల్గొన్నారు.