అంగన్‌వాడీలపై నజర్‌ | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలపై నజర్‌

Apr 26 2025 8:02 AM | Updated on Apr 26 2025 8:02 AM

అంగన్

అంగన్‌వాడీలపై నజర్‌

కొనుగోలు కమిటీల ద్వారా టెండర్లు

దిలా ఉంటే అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యమైన సరుకులు సరఫరా అయ్యేలా దృష్టి పెట్టింది. సరుకుల కొనుగోళ్ల విషయంలో సొంత నిర్ణయాలకు అవకాశం లేకుండా చేసింది. ఈ–టెండర్‌ విధానాన్ని పాటించేలా సూచనలు జారీ చేసినట్లు సమాచారం. కలెక్టర్‌ ఆధ్వర్యంలో జిల్లా కొనుగోలు కమిటీ ద్వారా టెండర్లు పిలవాలని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. కోడిగుడ్లు సరిగ్గా సరఫరా జరిగేలా చూసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

జహీరాబాద్‌: ఇక నుంచి అంగన్‌వాడీ కేంద్రాలు మొక్కుబడిగా నిర్వహించకుండా ఉన్నతాధికారుల పర్యవేక్షణ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిన్నారులు కేంద్రాలకు వచ్చి పోవడంతోనే సరిపెట్టకుండా వారికి ఆటాపాట నేర్పించాలనే దానిపై దృష్టి పెట్టింది. అందుకే అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు ఆధారంగా గ్రేడింగ్‌ ఇవ్వనున్నట్లు ఇటీవల ఉన్నతాధికారులతో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పిన విషయం తెలిసిందే. మంచి గ్రేడింగ్‌ ఉన్న కేంద్రాలకు అవార్డులను సైతం ఇవ్వనున్నట్లు పేర్కొంది. చిన్నారులు లేరనే సాకులతో కేంద్రాలను మూసివేయడం సరికాదని, ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసుకుని సంఖ్యను పెంచడంపై దృష్టి సారించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మార్చుకునే అవకాశం

ప్రస్తుతం నిర్వహిస్తున్న కేంద్రాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్నట్లయితే ఎక్కువ సంఖ్య వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలకు కేంద్రాలను మార్చుకునే అవకాశం కల్పించింది. ప్రతీ కేంద్రంలో తప్పనిసరిగా 20 మంది సంఖ్య ఉండేలా నిర్వాహకులు చూసుకోవాల్సి ఉంటుంది. బడి బాట తరహాలోనే గ్రామాల్లో చిన్నారులను గుర్తించి అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు ఐసీడీఎస్‌ అధికారులు, ఆయా కేంద్రాల నిర్వాహకులు ప్రయత్నాలు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే కేంద్రాల నిర్వహణ సరిగ్గా లేదనే భావన ఉంది. చిన్నారుల సంక్షేమంపై భారీగా ఖర్చు పెడుతున్నా అధికారులు సరిగ్గా పనిచేయడం లేదనే అపోహ ప్రభుత్వం దృష్టిలో ఉంది. దీన్ని సరిచేసేందుకుగాను ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని యోచిస్తోంది. అందులోభాగంగానే జిల్లా సంక్షేమాధికారులు వారానికి కనీసం మూడు కేంద్రాలను అయినా సందర్శించేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

పిల్లల సంఖ్య పెంచేలా చర్యలు

ఉన్నతాధికారుల పర్యవేక్షణ తప్పనిసరి

గ్రేడింగ్‌ విధానం అమలుకు నిర్ణయం

అంగన్‌వాడీ బాటతో సంఖ్య పెంచుతాం

కేంద్రాలకు విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకుగాను మే నెలలో అంగన్‌వాడీ బాట కార్యక్రమం చేపడతాం. కేంద్రం నిర్వాహకులు ప్రతీ ఇంటికి వెళ్లి చిన్నారుల గురించి ఆరా తీస్తారు. రెండేళ్లు నిండిన చిన్నారులను కేంద్రాలకు పంపించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాం. సంఖ్య తక్కువ ఉన్న పట్టణ ప్రాంతాల్లోని రెండు మూడు కేంద్రాలను ఎక్కువ ఉన్న ప్రాంతాలకు మార్పించాం. కేంద్రాల పనితీరుపైనే ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతోంది.

–లలితకుమారి,

జిల్లా సంక్షేమాధికారి, సంగారెడ్డి

అంగన్‌వాడీలపై నజర్‌1
1/1

అంగన్‌వాడీలపై నజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement