
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
నారాయణఖేడ్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. మనూరు మండలం దుదగొండ పంచాయతీ పరిధిలోని గట్‌లింగంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదల సొంతింటి కల నెరవేరిందని గుర్తు చేశారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే పేదలకు పక్కా ఇళ్లు మంజూరయ్యాయి. ఒక్కో ఇంటికి రూ.5లక్షలు చెల్లించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు బ్రహ్మానందరెడ్డి, రాజు, ఽమాజీ సర్పంచ్ ధన్‌రాజ్ పాటిల్, సంజీవరెడ్డి పాల్గొన్నారు. అలాగే, ఖేడ్ మండలం ర్యాకల్‌లో 23న ప్రారంభమైన ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు మూడవరోజూ శుక్రవారం కొనసాగాయి. ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.