
వెల్దుర్తిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్న పోలీసులు
వెల్దుర్తి(తూప్రాన్): ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తూప్రాన్ సీఐ కృష్ణ, ఎస్‌ఐ నవతగౌడ్ సూచించారు. వచ్చేనెల 13న ఎన్నికల సందర్భంగా మండల కేంద్రం వెల్దుర్తిలో బుధవారం సాయంత్రం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ హనుమాన్, బస్టాండ్ చౌరస్తా మీదుగా అంబేడ్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. అనంతరం వారు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటును స ద్వినియోగం చేసుకునేందుకు ఎలాంటి ఆటంకం కలగకుండా తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓటర్లు ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది, కేంద్ర బలగాలు పాల్గొన్నాయి.