
ప్రాంతీయ ఆస్పత్రిలో సమీక్ష నిర్వహిస్తున్న డీసీహెచ్‌ఏ సంగారెడ్డి
నారాయణఖేడ్: సీజనల్ వ్యాధులు ప్రబలుతుండగా రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించే విషయమై డాక్టర్లు నిర్లక్ష్యం వహించొద్దని ప్రాంతీయ ఆస్పత్రుల జిల్లా సమన్వయకర్త(డీసీహెచ్‌ఏ) సంగారెడ్డి.. సిబ్బందికి సూచించారు. బుధవారం ఖేడ్ ప్రాంతీయ ఆస్పత్రిని సందర్శించారు. రోగులకు సంబంధించిన వార్డులను పరిశీలించారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు విజృంభిస్తున్నందున అప్రమత్తతతో ఉండాలని సూచించారు. రోగులు, ప్రమాద బాధితులకు సత్వర చికిత్స అందించాలని ఆదేశించారు.ఆస్పత్రిలోనే ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. రోగులకు అందుబాటులో ఉన్న మందులు ఇతర విషయాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రాంతీయ ఆస్పత్రుల జిల్లా సమన్వయకర్త సంగారెడ్డి