పటాన్‌చెరు: అమీన్‌పూర్‌లో కొత్తగా ఉప తపాలా కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. అలాగే కొత్త పిన్‌కోడ్‌ను అమీన్‌పూర్‌కు కేటాయించారని పోస్టల్ అధికారులు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయానికి సమీపంలో కొత్త ఉప తపాల కార్యాలయాన్ని ఆ శాఖ హైదరాబాద్ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీలత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలందరూ కొత్తగా కేటాయించిన పిన్‌కోడ్‌ను ఉపయోగించాలన్నారు. ఆధార్, బ్యాంకు చిరునామాల్లో కొత్త పిన్‌కోడ్ 502033 నమోదు చేయాలని సూచించారు. ఇప్పటి వరకు అమీన్‌పూర్ ప్రాంతంలోని చిరునామాలకు 502032ని వాడుకునే వారని, ఇకపై కొత్త పిన్‌కోడ్ వినియోగించాలన్నారు. పోస్టల్ బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమ శాఖ ఈనెల 1 నుంచి కొత్త సేవింగ్స్ పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి మాట్లాడుతూ కొత్త పోస్టాఫీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పోస్టల్ శాఖ అధికారులు కె.నరేంద్రబాబు, ఎస్‌వీఎల్‌ఎన్ రావు, కౌన్సిలర్ బి.కృష్ణ , ఆర్సీపురం ఇన్‌స్పెక్టర్ పోస్ట్స్ వి.రాహూల్ పాల్గొన్నారు.
కొత్త ఉప తపాలా కార్యాలయం ప్రారంభం
కొత్త పిన్ కోడ్ ఉపయోగించాలన్న
హైదరాబాద్ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీలత


