ప్రతాప్‌రెడ్డికి డాక్టరేట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రతాప్‌రెడ్డికి డాక్టరేట్‌

May 19 2026 11:39 AM | Updated on May 19 2026 11:39 AM

మూసీలో పడిన మహిళ.. రక్షించిన పోలీసులు

చేవెళ్ల: కందవాడకు చెందిన సోలిపురం ప్రతాప్‌రెడ్డి గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు. విద్యారంగంలో అందించిన సేవలకు గుర్తింపుగా యునైటెడ్‌ అమెరికన్‌ యూనివర్సిటీ ఆదివారం చైన్నెలోని విద్యాభవన్‌ ఆయనకు డాక్టరేట్‌ ఇచ్చి సత్కరించింది బాలాపూర్‌ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్‌గా కొనసాగుతున్న ప్రతాప్‌రెడ్డి పద్దెనిమిదేళ్లుగా విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో అనేక మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యనందించడంతో పాటు ఆర్థికంగా ఆదుకుంటున్నారు.

చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

బొంరాస్‌పేట: మండల కేంద్రం శివారులోని అంతర్రాష్ట్ర రహదారి ప క్కన ఉన్న పెద్ద చెరువు లో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి(60) మృతదేహం లభ్యమైంది. మృతుడి వివరాలు తెలిస్తే స్థానిక పోలీసు స్టేషన్‌ లో తెలియజేయాలని పోలీసులు కోరారు. మృతదేహాన్ని కొడంగల్‌ మార్చురీకి తరలించారు.

చాదర్‌ఘాట్‌: ప్రమాదవశాత్తు మూసీలో పడిపోయిన మహిళను పోలీసులు రక్షించారు. సోమ వారం చాదర్‌ఘాట్‌ చిన్న బ్రిడ్జ్‌ సమీపంలో ఓ మహిళ ప్రమాదవశాత్తు మూసీ నదిలో పడిపోయింది. సమాచారం అందుకున్న చాదర్‌ఘాట్‌, కాచిగూడ పోలీసులు చేరుకొని స్థానికుల సహాయంతో ఆమెను బయటకు తీశారు. బాలజీనగర్‌లో నివసించే బాలామణి ముఖం కడుక్కోవ టానికి వచ్చి ప్రమాదవశాత్తు పడిపోయానని తెలిపింది. ఆమె మానసికస్థితి సరిగా లేదని పోలీసులు గుర్తించారు. ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement