ముదిరాజ్‌లు అన్ని రంగాల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

ముదిరాజ్‌లు అన్ని రంగాల్లో రాణించాలి

May 19 2026 11:39 AM | Updated on May 19 2026 11:39 AM

కందుకూరు: ముదిరాజ్‌లు అన్ని రంగాల్లో రాణించాలని ముదిరాజ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బొర్రా జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ అన్నారు. ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో మండల పరిధిలోని అగర్‌మియాగూడలోని ఏఎస్‌ఆర్‌ గ్రౌండ్‌లో అగర్‌మియాగూడ, లేమూరు, సరస్వతిగూడ గ్రామాలకు చెందిన ముదిరాజ్‌ యువకులతో ఈ నెల 12 నుంచి 17 వరకు క్రికెట్‌ లీగ్‌ పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన జట్లకు ఆదివారం రాత్రి ఆయన బహుమతుల ప్రదానం చేశారు. ప్రథమ స్థానంలో నిలిచిన నకుల సేన జట్టు, ద్వితీయ స్థానంలో నిలిచిన సహదేవసేన జట్టు కెప్టెన్లకు యూత్‌ కాంగ్రెస్‌ మాజీ మండల అధ్యక్షుడు ఢిల్లీ శ్రీధర్‌ముదిరాజ్‌తో కలిసి ట్రోఫీలను అందజేశారు. మ్యాన్‌ ఆఫ్‌ ది సీరిస్‌ అవార్డును భాషమోని బాలమురళీకృష్ణకు అందించారు. అనంతరం జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ మాట్లాడుతూ.. యువత క్రీడల్లో రాణిస్తూ, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో నిర్వాహ కులు ఢిల్లీ బాలకృష్ణ, ఎడ్ల బాలకృష్ణ, భాషమోని కిరణ్‌, మాదరమోని సురేష్‌, చింతకింది వినీష్‌, కాల్వ వంశీ, బూసరమోని నవీన్‌, మాజీ సర్పంచ్‌ ఢిల్లీ గణేశ్‌, సరస్వతిగూడ ఉప సర్పంచ్‌ బూసర మోని భాస్కర్‌, నరేందర్‌, నీరటి పాండు, కాల్వ విష్ణు, ఎడ్ల నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement