విజయ్‌కుమార్‌కు దళితరత్న అవార్డు | - | Sakshi
Sakshi News home page

విజయ్‌కుమార్‌కు దళితరత్న అవార్డు

May 2 2026 11:43 AM | Updated on May 2 2026 11:43 AM

విజయ్‌కుమార్‌కు దళితరత్న అవార్డు బడంగ్‌పేట్‌: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, జిల్లా ఎస్సీ రైట్స్‌ ప్రొటెక్షన్‌ సొసైటీ సభ్యుడు బడంగ్‌పేటకు చెందిన సూర్ణగంటి విజయ్‌కుమార్‌ దళితరత్న అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు శుక్రవారం మినిస్టర్‌ క్వార్టర్స్‌లో ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. కార్యక్రమంలో తెలంగాణ రైట్స్‌ ప్రొటక్షన్‌ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు, ఉత్సవాల కమిటీ చైర్మన్‌ డి.సుదర్శన్‌బాబు, కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి శివకుమార్‌లాల్‌, ఎన్‌టీవీపీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రంజిత్‌ తదితరులు పాల్గొన్నారు. ఆలయాల అభివృద్ధికి సహకారం మీర్‌పేట: దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని టీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్‌ చల్లా నర్సింహారెడ్డి అన్నారు. జిల్లెలగూడ కమలానెహ్రూనగర్‌లో ముత్యాలమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రతినిధులు నర్సింహారెడ్డిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు చల్లా బాల్‌రెడ్డి, సిద్దాల శ్రీశైలం, చలా ప్రభాకర్‌రెడ్డి, చల్లా శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్‌గౌడ్‌, విజయవర్ధన్‌రెడ్డి, మురళీగౌడ్‌, సుభాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాధ్యతల స్వీకరణ అబ్దుల్లాపూర్‌మెట్‌: ఎంఎంసీ పరిధిలోని నాగోల్‌ సర్కిల్‌ –11 డిప్యూటీ కమిషనర్‌గా ఎస్‌.నిత్యానంద్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ కమిషనర్‌గా పనిచేసిన ఎస్‌. రవీందర్‌రెడ్డి గురువారం ఉద్యోగ విరమణ కావడంతో ఆయన స్థానంలో నాచారం సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న నిత్యానంద్‌ను నాగోల్‌ సర్కిల్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు ఆయన పెద్దఅంబర్‌పేటలోని సర్కిల్‌ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎల్‌బీనగర్‌ జోనల్‌ కమిషనర్‌ వికాస్‌ మహతోను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. చేవెళ్ల మున్సిపల్‌ కమిషనర్‌గా యాదగిరి పంట మార్పిడితో లాభాలు

చేవెళ్ల: మున్సిపల్‌ నూతన కమిషనర్‌గా బి.యాదగిరి బదిలీపై వచ్చారు. మున్సిపల్‌ కార్యాలయంలో శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఉన్న వెంకటేశం బదిలీ కావడంతో ఆయన స్థానంలో కొల్లాపూర్‌ మున్సిపాలిటీ నుంచి బి.యాదగిరి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరి సహాయ సహకారాలతో మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు.

షాబాద్‌: పంట మార్పిడితో అధిక లాభాలు వస్తాయని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు భద్రు, కిరణ్‌బాబు పేర్కొన్నారు. మండల పరిధిలోని తాళ్లపల్లి రైతు వేదికలో శుక్రవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతీ సంవత్సరం ఒకే పంట సాగు చేయకుండా మార్పిడి చేయాలని అన్నారు. పత్తిలో హెడీపీఎస్‌ పద్ధతిన సాగు చేస్తే దిగుబడి వస్తుందన్నారు. సేంద్రియ ఎరువులతో సాగు చేయాలన్నారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పద్ధతులను అనుసరించినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని చెప్పారు. రైతులు సాగు ఖర్చులను తగ్గించుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయశాఖ అధికారి దండెం విజయచంద్ర, సర్పంచులు తాళ్ల స్వాతి మాణిక్యంగౌడ్‌, కుమార్‌, నర్సింలు, ఉపసర్పంచ్‌ ఆంజనేయులు, ఏఈఓ గీత తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement