పహాడీషరీఫ్: బాలాపూర్ పోలీసులు ఆపరేషన్ చబుత్రా మిషన్ చేపట్టి శనివారం అర్ధరాత్రి వేళ బస్తీలలో తిష్టవేసి న్యూసెన్స్ పాల్పడుతున్న యువకుల భరతం పట్టారు. స్టేషన్ పరిధిలోని ఎర్రకుంట, షాహిన్‌నగర్‌లో అకస్మాత్తుగా సోదాలు జరిపి పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లేట్ నైట్ నడుపుతున్న మండీ హోటళ్లలోనూ సోదాలు జరిపారు. ఇన్‌స్పెక్టర్ సుధాకర్ పర్యవేక్షణలో కొనసాగిన ఈ సోదాలలో యువకులతో పాటు హోటళ్ల యజమానులకు ఆఖరి సారిగా హెచ్చరించారు. ఈ సోదాలు క్రమం తప్పకుండా కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.


