షాబాద్: కురుమలు ఐకమత్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాపోల్ నర్సింలు పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని మల్లారెడ్డిగూడ గ్రామ కమిటీ ఏర్పాటు కార్యక్రమంలో ఆయన కురుమ సంఘం మండల అధ్యక్షుడు మద్దూరు పాండుతో కలిసి పాల్గొన్నారు. కొత్తగా ఎంపికై న కమిటీ సభ్యులకు శాలువాలతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనాభాపరంగా కురుమలకు రాజకీయ లబ్ధి రావడం లేదన్నారు. ఐకమత్యంగా ఉండి ఎలాంటి ఎన్నికలు వచ్చినా ఒకరికొకరు సహాయం చేసుకోవాలన్నారు. సంఘం మల్లారెడ్డిగూడ గ్రామ అధ్యక్షుడిగా రంగం ఆంజనేయులు, ఉపాధ్యక్షులు సంజీవ, రాజేందర్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, సలహాదారులు భీమయ్య, కార్యదర్శి కుమార్, కోశాధికారి రాజేందర్, కార్యదర్శి రాఘవేందర్‌లను ఎనుకున్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మాణిక్యం, మాజీ ఉపసర్పంచ్ రంగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కురుమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింలు


