ఏడేళ్లుగా తిరుగుతున్నా.. | - | Sakshi
Sakshi News home page

ఏడేళ్లుగా తిరుగుతున్నా..

Apr 6 2026 8:36 AM | Updated on Apr 6 2026 8:36 AM

ఏడేళ్లుగా తిరుగుతున్నా..

కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ రెవెన్యూ సర్వే నంబర్‌ 44లో ఎకరం పట్టా భూమి ఉంది. 2018 వరకు నా పేరునే పట్టా ఉంది. ధరణి పోర్టల్‌ వచ్చిన తర్వాత నా భూమిని వేరే వారి పేరున నమోదు చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా. వేరేవాళ్లు తమ భూమి కాదని స్వయంగా అఫిడవిట్‌ కూడా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ భూమి నాపేరున నమోదు కాలేదు. వేరే వారి మధ్య భూ వివాదం ఉండటం, వారు కోర్టును ఆశ్రయించడంతో సర్వే నంబర్‌ మొత్తాన్ని నిషేధిత జాబితాలో చేర్చారు. ఇందులో నా పట్టా భూమి కూడా ఉంది. దీన్ని తొలగించాల్సిందిగా కోరుతూ ఏడేళ్ల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా. అయినా సమస్య పరి ష్కరించలేదు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు, రవాణా ఖర్చులు, ఇతర చెల్లింపుల కోసం ఇప్పటికే రూ.2 లక్షలపైనే ఖర్చు చేయాల్సి వచ్చింది.

– అబ్బి రామచంద్రయ్య, పాపిరెడ్డిగూడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement