మార్కెట్లో క్రయవిక్రయాలు సాఫీగా కొనసాగేలా, ఎలాంటి ఇబ్బందులకు తావులేకుండా ఏర్పాట్లు చేశాం. ప్రత్యేకంగా 12 ఎకరాల ప్రాంగణంలో భారీ షెడ్లు, మరో 7 ఎకరాల్లో వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశాం. మార్కెట్ ప్రాంగణంలో మామిడి పండ్లతో వచ్చే వాహనాలు సాఫీగా రాకపోకలు సాగించేలా అంతర్గత రోడ్లు నిర్మించాం. మార్కెట్లో రైతులు, వ్యాపారులు దప్పిక తీర్చుకునేందుకు చల్లటి తాగునీటి యంత్రాలు, మామిడి బిడ్డింగ్, నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.
– చిలుక మధుసూదన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్
●


