మార్కెట్‌కు మామిడి పండ్లు తీసుకువచ్చే రైతుల నుంచి 4 శాతం మాత్రమే ఏజెంట్లు కమీషన్ తీసుకోవాలి. నిర్ణయించిన దానికంటే ఎక్కువగా వసూలు చేస్తే మా దృష్టికి తేవాలని సూచిస్తూ యార్డులో బోర్డులు ఏర్పాటు చేశారు. మామిడిని ప్యాకింగ్ చేసే క్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అనుమతులు ఇచ్చిన ప్రకారమే ఇథలిన్ ప్యాకెట్లను మోతాదులో వాడే విధంగా వ్యాపారులకు సూచనలు చేశాం. నిబంధనలను అతిక్రమిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేసే వారితో కఠినంగా వ్యవహరిస్తాం.
– శ్రీనివాస్, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి


