నేడు కొహెడకు హరీశ్‌రావు రాక | - | Sakshi
Sakshi News home page

నేడు కొహెడకు హరీశ్‌రావు రాక

Apr 6 2026 8:36 AM | Updated on Apr 6 2026 8:36 AM

నేడు కొహెడకు హరీశ్‌రావు రాక గ్రామాల్లో బీజేపీని బలోపేతం చేయాలి నాణ్యత లేని పిండి పట్టివేత కబ్జా చెర నుంచి పార్కును కాపాడండి

తుర్కయంజాల్‌: మాజీ మంత్రి టి.హరీశ్‌రావు సోమవారం ఆదిబట్ల సర్కిల్‌ పరిధి కొహెడలోని పండ్ల మార్కెట్‌ భూములను పరిశీలించనున్నట్లు జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ సత్తు వెంకటరమణా రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సర్వే నంబర్‌ 167 బై 1లో భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడనున్నారని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి తదితరులు పాల్గొననున్నారని చెప్పారు. పార్టీశ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

మంచాల: గ్రామాల్లో బీజేపీని బలమైన శక్తిగా తయారు చేయాలని పార్టీ రాష్ట్ర నాయకులు బూర నర్సయ్య గౌడ్‌, శ్రీవర్ధన్‌రెడ్డి, కొప్పు భాష, బొక్క నర్సింహా రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాబియన్‌ 2026 కార్యక్రమానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ప్రజలను చైతన్యపర్చి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గోగిరెడ్డి లచ్చిరెడ్డి, వింజమూరి వెంకట్‌రెడ్డి, దన్నె భాషయ్య, శ్రీశైలం, జంగయ్య గౌడ్‌, గోవర్ధన్‌చారి, పాండు, మండల అధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్‌రెడ్డి, యాట రమేష్‌ ముదిరాజ్‌, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

176 బ్యాగులు స్వాధీనం

అబిడ్స్‌: నాణ్యత లేని వివిధ రకాల పిండిని తయారు చేసి విక్రయిస్తున్న గోదాముపై టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు దాడులు చేసి 176 బ్యాగుల సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మంగళ్‌హాట్‌ ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కోల్సీవాడి ప్రాంతానికి చెందిన శుభం సాంట్ల (30) లోయర్‌ ధూల్‌పేట్‌లోని జుంగూర్‌ బస్తీలో మారుతి ట్రేడింగ్‌ కంపెనీ గోదాము పెట్టాడు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి నాణ్యత లేని మొక్కజొన్న, బియ్యం, జొన్నలు తీసుకువచ్చి పిండి తయారు చేసి శివం సాంట్ల శుభం ఎంపీపీ బ్రాండ్‌తో విక్రయిస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆదివారం గోదాముపై దాడి చేసి 108 బస్తాల మొక్కజొన్న పిండి, 60 బస్తాల బియ్యం పిండి, 8 బస్తాల జొన్న పిండి, 50 ఖాళీ రోల్స్‌ బెండల్స్‌, మూడు వేయింగ్‌ మిషన్లు, ఒక ఫ్లోర్‌ ప్యాకింగ్‌ మిషిన్‌ను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ

కవాడిగూడ: నగరంలోని ఇందిరా పార్కులో ఆక్రమణలను వెంటనే అడ్డుకోవాలని సీపీఐ జాతీయ నాయకుడు డాక్టర్‌ కె.నారాయణ డిమాండ్‌ చేశారు. ‘సేవ్‌ ఇందిపార్కు’ పేరిట ఆదివారం వాకర్స్‌ నిర్వహించిన నిరసనలో నారాయణతో పాటు సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. ఎమరాల్డ్‌ స్వీట్‌ హౌస్‌, డంపింగ్‌ యార్డు, స్నో వరల్డ్‌, షటిల్‌ కోర్టు పేర్లతో ఇందిరాపార్కు చుట్టూ ఉన్న స్థలం కబ్జాకు గురవుతుందని ఆరోపించారు. స్థలాన్ని రక్షించేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి స్టాలిన్‌, ఇందిరాపార్కు వాకర్స్‌ ప్రతినిధులు రవీందర్‌ రెడ్డి, నర్సింగ్‌రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement