చోరీ కేసులో నిందితులకు రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో నిందితులకు రిమాండ్‌

Apr 1 2026 8:18 AM | Updated on Apr 1 2026 8:18 AM

మొయినాబాద్‌రూరల్‌: ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం, వెండి వస్తువులను దొంగలించిన నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. మార్చి 26న రాత్రి బి.శ్రీనివాస్‌ అలియాస్‌ శ్రీను, మేకల శివకుమార్‌ కలిసి కాశీంబౌలిలోని ఓ ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి బంగారం, వెండి వస్తువులను అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం మొయినాబాద్‌ చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. నిందితుల నుంచి బంగారం, వెండి ఆభరణాలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement