అభివృద్ధికే ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధికే ప్రాధాన్యం

Feb 17 2026 8:51 AM | Updated on Feb 17 2026 8:51 AM

అభివృ

అభివృద్ధికే ప్రాధాన్యం

పురపాలికల అభివృద్ధే ధ్యేయంగా తమ పాలన కొనసాగిస్తామని నూతనంగా ఎన్నికై న చైర్మన్లు ముక్తకంఠంతో పేర్కొన్నారు. ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రగతిబాటలో పయనిస్తామని ప్రమాణ స్వీకారం అనంతరం వెల్లడించారు. షాద్‌నగర్‌, చేవెళ్ల, మొయినాబాద్‌, శంకర్‌పల్లి, ఆమనగల్లు మున్సిపల్‌ పీఠాలను అధిరోహించిన తరుణంలో తమ మనోగతాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు.

రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రగతిపథం

మున్సిపల్‌ పీఠాలను అధిరోహించిన ఆయా చైర్మన్లు

సాక్షి ఇంటర్వ్యూలో వెల్లడించిన ప్రణాళిక

క్రమపద్ధతిలో పరిష్కరిస్తా

షాద్‌నగర్‌: మున్సిపాలిటీ చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన అగ్గునూరు బస్వం ‘సాక్షి’తో మాట్లాడారు. తన గెలుపునకు ఎమ్మెల్యే శంకర్‌, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డితో పాటు, మాజీ చైర్మన్‌ విశ్వంతో పాటుగా అన్ని వర్గాల వారు ఎంతో కృషి చేశారు. వార్డుల్లో నెలకొన్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్‌ దీపాలు, వంటి తదితర సమస్యలున్నాయి. వాటన్నింటిని నెరవేరుస్తాం. సమస్యలను క్రమపద్ధతిలో పరిష్కరించి మౌలిక సదుపాయాలను కల్పిస్తా.

డ్రైనేజీలు ఏర్పాటు చేస్తాం

శివారు కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాల్సి ఉంది. డ్రైనేజీల నిర్మాణానికి తొలి ప్రాధాన్యం ఇస్తా. కాలువల నిర్మాణం లేకపోతే దుర్గంధం ఉత్పన్నం అవుతోంది. ప్రతి వార్డులో పర్యటించి సమస్యలను గుర్తిస్తా. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా. వార్డులను అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటాను. రానున్న ఐదేళ్లలో వార్డుల్లో సమస్య అన్నది లేకుండా చేయడమే నా ముందున్న ప్రధాన లక్ష్యం.

అభివృద్ధికే ప్రాధాన్యం1
1/1

అభివృద్ధికే ప్రాధాన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement