కాంగ్రెస్ విజయోత్సవం
మొయినాబాద్: మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక అనంతరం కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు నిర్వహించింది. అజీజ్‌నగర్‌లోని మున్సిపల్ కార్యాలయం వద్ద రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫయిముద్దీన్, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి గౌరి సతీష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాణయ్య తదితరులు చైర్‌పర్సన్ దుబ్బ సోనియాదర్శన్, వైస్ చైర్మన్ గరుగు రాజు, కౌన్సిలర్లను సన్మానించి అభినందించారు. అనంతరం అజీజ్‌నగర్, మొయినాబాద్ కేంద్రంలో టపాసులు పేల్చుతూ ర్యాలీ నిర్వహించారు.
సంబరాల్లో అపశృతి..
సంబరాల్లో భాగంగా టపాసులు ముట్టిస్తుండగా షాబాద్ దర్శన్ డ్రైవర్ ప్రదీప్‌ను ఓ కారు ఢీకొట్టింది. దీంతో అతని కాలు విరిగింది. వెంటనే చికిత్సకోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.


