బైక్‌ అదుపు తప్పి.. చెట్టును ఢీ కొట్టి | - | Sakshi
Sakshi News home page

బైక్‌ అదుపు తప్పి.. చెట్టును ఢీ కొట్టి

Feb 17 2026 8:51 AM | Updated on Feb 17 2026 8:51 AM

బైక్‌ అదుపు తప్పి.. చెట్టును ఢీ కొట్టి

బైక్‌ అదుపు తప్పి.. చెట్టును ఢీ కొట్టి

కందుకూరు: బైక్‌ అదుపు తప్పి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కందుకూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సీతారామ్‌ కథనం ప్రకారం.. మండల పరిధిలోని నేదునూరుకు చెందిన నల్లి శ్రీనివాస్‌ (37) మహేశ్వరం ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరాడు. మార్గమధ్యలో పులిమామిడి నుంచి బాచుపల్లి మార్గంలో మయూరి ఫామ్స్‌ వద్ద బైక్‌ అదుపు తప్పి చెట్టుకు ఢీకొని తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. విషయాన్ని గుర్తించిన ప్రయాణికులు కుటుంబీకులు, పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు ఎస్‌ఐ పరమేష్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వాచ్‌మన్‌ ఆత్మహత్య

చైతన్యపురి: ఓ భవనం సెల్లార్‌లో హైడ్రాలిక్‌ పార్కింగ్‌ రాడ్‌కు వాచ్‌మన్‌ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చైతన్యపురి ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన మేరకు.. చైత్యపురి బస్‌ స్టాప్‌ వెనకవైపు నీరటి రాజు, అతని సోదరులు కలిసి కమర్షియల్‌ కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నారు. 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న శ్యామల ముత్తయ్య (40)ను అక్కడ వాచ్‌మన్‌గా నియమించారు. అయితే ముత్తయ్య సోమవారం తెల్లవారుజామున సెల్లార్‌లో హైడ్రాలిక్‌ కార్‌ పార్కింగ్‌ రాడ్‌కు ఉరేసుకుని కనిపించాడు. మరో వాచ్‌మన్‌ గమనించి సూపర్‌వైజర్‌కు సమాచారం ఇవ్వడంతో అతను కుటుంబ సభ్యులకు తెలయజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. ముత్తయ్య భార్య పదేళ్ల క్రితం మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement