శక్తివంచన లేకుండా కృషి చేస్తా | - | Sakshi
Sakshi News home page

శక్తివంచన లేకుండా కృషి చేస్తా

Feb 17 2026 8:51 AM | Updated on Feb 17 2026 8:51 AM

శక్తివంచన లేకుండా కృషి చేస్తా

శక్తివంచన లేకుండా కృషి చేస్తా

చేవెళ్ల: మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చేవెళ్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దేవర సమతావెంకట్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యా దయ్య సహకారంతో పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆమె సాక్షితో మాట్లాడారు.

ప్రశ్న: తొలి చైర్‌పర్సన్‌గా అనుభూతి ఎలా ఉంది?

జవాబు: నాకు మొదటి మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా అవకాశం రావటం దేవుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తాను. ఈ అవకాశం రావటం ఎంతో సంతోషంగా ఉంది.

ప్రశ్న: మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏమిటి? వాటిని ఎలా పరిష్కరిస్తారు?

జవాబు: కాలనీలలో రోడ్లు, డ్రైనేజీలు, పలు చోట్ల నీటి సమస్యలతో పాటు పింఛనలు, ఇళ్లు లేవని గుర్తించాం. వాటిని ఎమ్మెల్యే చొరవతో పరిష్కరిస్తాం. నా భర్త దేవర వెంకట్‌రెడ్డితో కలిసి ఎనిమిదేళ్లుగా నేను రాజకీయాల్లో కొనసాగుతున్నా. ఎంతో కొంత రాజకీయ పరిజ్ఞానం ఉంది. చేవెళ్ల ప్రజల సహకారంతో పట్టణంలోని సమస్యలను పరిష్కరిస్తా.

ప్రశ్న: ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయా?

జవాబు: ప్రజా సమస్యల పరిష్కారమే నా ప్రణాళిక. మౌలిక వసతుల కల్పనకు మొదటి ప్రాధాన్యం ఇస్తా. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తా.

ప్రశ్న: ఐదేళ్ల మీ పాలన ఎలా ఉండబోతోంది?

జవాబు: ప్రజారంజక పాలన అందిస్తాం. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తాం. కౌన్సిలర్లందరినీ కలుపుకొని అభివృద్ధి పథంలో సాగుతాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement