ఫార్మర్ రిజిస్ట్రీ 56 శాతం మించలే!
15 మంది వీఏఓలకు షోకాజ్ నోటీసులు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఫార్మర్ రిజిస్ట్రీ జిల్లాలో ఆశించిన స్థాయిలో నమోదు కావడం లేదు. ఇప్పటి వరకు 56 శాతం మించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా ప్రకారం జిల్లా వ్యాప్తంగా 1.97 లక్షల మంది రైతులు ఉన్నట్లు అంచనా. వీరిలో ఇప్పటి వరకు 85 వేల మంది మాత్రమే తమ పేర్లు, భూములు, పంటల వివరాలను నమోదు చేయించారు. మెజార్టీ లబ్ధిదారులు గ్రామాల్లో ఉండకపోవడం, నగరంలో స్థిరపడటమే తక్కువ రిజిస్ట్రీకి కారణమని తెలిసింది. 60 వేల మంది రైతులు భూములను కలిగి ఉన్నప్పటికీ.. సాగుకు దూరంగా ఉన్న వాళ్లు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఫార్మర్ రిజిస్ట్రీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 15 మంది వీఏఓలకు రెండు రోజుల క్రితం జిల్లా వ్యవసాయశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేయడం కొసమెరుపు. ప్రస్తుత యాసంగిలో 1.57 లక్షల ఎకరాల పంట సాగు అవుతుందని అంచనా వేసింది. అయితే ఇప్పటి వరకు 1.19 లక్షల ఎకరాలు మాత్రమే సాగైనట్లు వ్యవసాయశాఖ గుర్తించింది.
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
మొయినాబాద్‌రూరల్: సర్పంచ్‌లుగా గెలిచిన వారు గ్రామాల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేయాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సూచించారు. బుధవారం సర్పంచ్‌ల సంఘం కమిటీ ఎంపీని మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్‌రెడ్డి సర్పంచ్‌లను సన్మానించి అభినందనలు తెలిపారు. పంచాయతీలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేలా కృషి చేయాలన్నారు. ఎంపీని కలిసిన వారిలో సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షకుడు ప్రవీణ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకటేశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి రాజేందర్‌రెడ్డి, పాషా, పద్మసంజీవరెడ్డి, పలువురు సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.


