ఎకరాకు ఒక్క బస్తా మాత్రమే
కందుకూరు: యాసంగి పంటల సాగు కోసం అవసరమైన యూరియా కొనుగోలుకు రైతులు కందుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్దకు చేరుకున్నారు. మంగళవారం 450 బస్తాల యూరియా రాగా ఒక్కో ఎకరాకు ఒక బస్తా చొప్పున అధికారులు సరఫరా చేశారు. మొక్కజొన్న, వరి పంటల కోసం యూరియాను అధికంగా వినియోగిస్తారు. చాలా మంది పంటలు ఇంకా నారుమళ్ల స్థాయిలోనే ఉండగా, మున్నుందు దొరికదనే భావనలో యూరియా కొనుగోలు చేయడానికి ముందస్తుగా వస్తున్నారు. దీంతో పీఏసీఎస్ కార్యాలయంలో ఆన్‌లైన్‌లో వేలిముద్ర ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉండటంతో క్యూలో నిరీక్షిస్తున్నారు.


