రోడ్డు భద్రతపై అవగాహన
యాచారం: రోడ్డు భద్రతపై ప్రజలు దృష్టి సారించాలని యాచారం సీఐ నందీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మాల్ మార్కెట్లో మంగళవారం రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డుపై ప్రయాణించే సమయంలో సరైన భద్రత చర్యలు పాటించాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, హెల్మెట్ లేకుండా బైక్‌పై వెళ్లరాదని సూచించారు. రోడ్డుపై ప్రయాణించే సమయంలో అతి వేగంగా, నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో కూడా రోడ్డు భద్రతపై వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యాచారం తహసీల్దార్ అయ్యప్ప, ఎంపీడీఓ రాధారాణి, ఎస్‌ఐ మధు తదితరులు పాల్గొన్నారు.


