మహాసభలను జయప్రదం చేయండి
యాచారం: అఖిల భారత మహిళా సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మస్కు అరుణ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని చింతుల్ల గ్రామంలో మంగళవారం ఈనెల 25 తేదీ నుంచి 28వ తేదీ వరకు నగరంలో జరిగే సభలకు సంబంధించి వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహా సభలను విజయవంతం చేయడం కోసం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సభలకు మాజీ ఎంపీ బృందా కారత్, అఖిల భారత మహిళా సంఘం జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి పీకె, ప్రధాన కార్యదర్శి ధావలే తదితరులు హాజరవుతారని చెప్పారు. కార్యక్రమంలో మస్కు జ్యోతి, శ్యామల, పద్మజ, జంగమ్మ, సరిత, మాధవి తదితరులు పాల్గొన్నారు.
ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు అరుణ


