నవ వధువు అదృశ్యం
రేపు కార్గో వస్తువుల వేలం
హైదరాబాద్: దర్గా దర్శనానికి వెళ్లిన నవ వధువు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. బాలాపూర్ ఉమర్ కాలనీకి చెందిన షేక్ జమీర్ అలీ వివాహం కతీజా సాది(19)తో నెల రోజుల క్రితం వివాహం జరిగింది. ఈ నెల 18వ తేదీనా మధ్యాహ్నం 3 గంటలకు జమీర్ అలీ తల్లి సాబేరా బేగం, వదిన అంజుమ్, భార్య కతీజా లు పహాడీషరీఫ్ దర్గా దర్శనానికి వెళ్లారు.
దర్శనమనంతరం ఇప్పుడే వస్తానంటూ వెళ్లిన కతీజా తిరిగి రాలేదు. ఆమె ఫోన్ సైతం స్విచ్ఛాప్ వచ్చింది. ఆమె ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో, అదే రోజు రాత్రి ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గాని 87126 62367 నంబర్‌లో గాని సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.


