చెత్త వేస్తే జరిమానా విధిస్తాం
మీర్‌పేట: రోడ్లపై చెత్త వేస్తే జరిమానాలు విఽధిస్తామని బడంగ్‌పేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ త్రిల్లేశ్వరరావు హెచ్చరించారు. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్‌లో భాగంగా మంగళవారం మీర్‌పేట, జిల్లెలగూడ, ప్రశాంతిహిల్స్ డివిజన్లలో ఆయన పర్యటించారు. బహిరంగ ప్రదేశాలలో మల, మూత్ర విసర్జన చేయరాదని, తడి, పొడి చెత్తను వేర్వేరుగా స్వచ్ఛ ఆటోల్లో వేయాలని ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ అవగాహన కల్పించారు. అదే విధంగా 58 డివిజన్ బాలాపూర్ చౌరస్తాలోని ప్రధాన రహదారి, 59 డివిజన్ జిల్లెలగూడ ప్రధాన రహదారి, 60వ డివిజన్‌లోని భారత్ పెట్రోల్ బంకు వద్ద చెత్త వేస్తున్న వారిని గుర్తించి జరిమానాలు విధించారు. కార్యక్రమంలో శానిటేషన్ డీఈ అభినయ్‌కుమార్, ఏఈ గంగాప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ యాదగిరి, జూనియర్ అసిస్టెంట్ నర్సింహ, పర్యావరణ ఇంజినీర్ రాము, జవాన్లు ఉన్నారు.


