పర్యావరణంపై అవగాహన పెంచాలి
కడ్తాల్: పర్యావరణంలో వాతావరణ మార్పులపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు అధ్యాపకులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని సామాజికవేత్త సూదిని పద్మారెడ్డి అన్నారు. అన్మాస్‌పల్లి సమీపంలోని ఎర్త్ సెంటర్‌లో కౌన్సిల్‌ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ, తెలంగాణ ఉన్నత విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీవాతవరణ మార్పులు–పర్యావరణ సుస్థిరతశ్రీ అంశంపై రెండు రోజుల పాటు రాష్ట్రంలోని 149 డిగ్రీ కళాశాలలకు చెందిన అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్‌లకు నిర్వహించిన అవగాహన సదస్సు మంగళవారంతో ముగిసింది. ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సూదిని పద్మారెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువకులతో పాటు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. ఎన్‌సీఈఆర్‌టీ ప్రొఫెసర్ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాల, కళాశాల స్థాయి నుంచే పర్యావరణ, వాతావరణ మార్పులపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించాలన్నారు. అనంతరం ప్రొఫెసర్లు, అధ్యాపకులకు సర్టిఫికెట్స్ అందజేశారు. సీజీఆర్ సంస్థ పర్యావరణ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీజీఆర్ చైర్ పర్సన్ లీలాలక్ష్మారెడ్డి, వ్యవస్థాపకుడు లక్ష్మారెడ్డి, శాస్త్రవేత్త డాక్టర్ సాయిభాస్కర్‌రెడ్డి, సమాజ క్రాంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ లెనిన్‌బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డాక్టర్ జగన్, డాక్టర్ వసంతలక్ష్మి, డాక్టర్ ప్రియాకుమారి, డాక్టర్ ఆనీ షీరాన్, డాక్టర్ ఉమామహేశ్వర్‌రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ అన్నమయ్య తదితరులు పాల్గొన్నారు.


