న్యాయమైన పరిహారానికి కృషి
● భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజు
● గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు భూ నిర్వాసితులతో సమావేశం
కడ్తాల్: గ్రీన్‌ఫీల్డ్ రేడియడ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న ఎక్వాయిపల్లి, మర్రిపల్లి గ్రామాల నిర్వాసితులతో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజు, రెవెన్యూ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎకరాకు రూ.30 లక్షల పరిహారం, ఒక ప్లాట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉందని, అభివృద్ధికి సహకరించాలని కోరారు. భూ నిర్వాసితులు మాట్లాడుతూ.. భూసేకరణ విధి విధానాలు, న్యాయపరమైన నష్ట పరిహారం ప్రకటించడకుండా సేకరణ చేపట్టడం తగదన్నారు. మార్కెట్ ధరకు అనుగుణంగా ఎకరాకు రూ.కోటి పరిహారం అందించాలని కోరారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని, కలెక్టరేట్‌లో సమావేశం ఏర్పాటుకు కృషి చేస్తానని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ జయశ్రీ, ఎస్‌ఐ వరప్రసాద్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


