టోల్‌ప్లాజా సిబ్బందికి శిక్షణ
కడ్తాల్: జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే ప్రయాణికులతో స్నేహపూర్వకంగా మెలగాలని ఎన్‌హెచ్‌ఏఐ హెచ్‌ఎల్‌ఎఫ్‌పీపీటీ శిక్షణ నిపుణులు అవినాశ్ కోహ్లీ, కృష్ణమూర్తి సూచించారు. మండల కేంద్రం సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ), హిందూస్థాన్ లేటెక్స్ ఫ్యామిలీ ప్రమోషన్ ట్రస్ట్ (హెచ్‌ఎల్‌ఎఫ్‌పీపీటీ) ఆధ్వర్యంలో టోల్‌ప్లాజా సిబ్బందికి మూడు రోజుల శిక్షణ తరగతులను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జాతీయ రహదారి మీదుగా ప్రయాణిస్తున్న ప్రయాణికులతో ఏ విధంగా నడుచుకోవాలి, హైవేలో ప్రయాణిస్తున్నప్పుడు ఇబ్బందులు కలిగితే సేవ్ అవర్ సోల్ (ఎస్‌ఓఎస్) ఏ విధంగా వాడాలి, రాజ్‌మార్గ్ యాత్ర యాప్ వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టోల్‌ప్లాజా మెనేజర్ దయారామ్ గుర్జర్, బాలకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.


