ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన
చేవెళ్ల: వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించి, సురక్షిత ప్రయాణం చేయాలని డీసీపీ యోగేశ్‌గౌతమ్, ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా పట్టణంలో సోమవారం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం, బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ద్విచక్రవాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయణించే వారు సీటుబెల్టు పెట్టుకోవాలని సూచించారు. రోడ్డుపైకి వచ్చే ప్రతి వాహనదారుడు విధిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు. అనంతరం మున్సి పాలిటీకి చెందిన మధుసూదన్‌గుప్తా 50 హెల్మెట్‌లను కొనుగోలు చేసి ఎమ్మెల్యే కాలె యాద య్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏసీపీ కిషన్, సీఐలు భూపాల్‌శ్రీధర్, డీఐ ఉపేందర్, ఎస్‌ఐలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మోడల్ స్కూల్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
షాబాద్: మోడల్ స్కూల్‌లో ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షాబాద్ తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కవిత ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఆరో తరగతి ప్రవేశాలతో పాటు ఏడు నుంచి పదో తరగతి వరకు ఖాళీ సీట్లను సైతం ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఫిబ్రవరి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఏప్రిల్ 16న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఉదయం సెషన్‌లో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందని, మధ్యాహ్న సెషన్‌లో ఏడు నుంచి పదో తరగతి వరకు ఖాళీ సీట్లకు ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందన్నారు. ఆబ్జెక్టివ్ టైప్ (బహుళ ఎంపిక ప్రశ్నలు) విధానంలో పరీక్ష నిర్వహిస్తారన్నారు.
మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ
మొయినాబాద్: ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. మున్సిపల్ కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మహిళలకు చీరలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు స్వ యం సమృద్ధి సాధించడానికి ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తుందని అన్నారు. మహిళల కు వడ్డీ లేని రుణాలు అందజేసి వారు ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, ఆర్డీఓ వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మ న్ చంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖాజా మోయిజుద్దీన్, నాయకులు షాబాద్ దర్శన్, హన్మంత్‌యాదవ్, రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసులతో
దురుసు ప్రవర్తన
తహసీల్దార్ డ్రైవర్‌పై కేసు నమోదు
యాచారం: ఓ తహసీల్దార్ కారు డ్రైవర్ దురుసు ప్రవర్తనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా పరిధిలోని ఓ మండల తహసీల్దార్, ఉప తహసీల్దార్, ఆర్‌ఐతో కలిసి సోమవారం సాయంత్రం కారులో నగరానికి వెళ్తున్నారు. మార్గమధ్యలో యాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో సాగర్ హైవేపై సీఐ నందీశ్వర్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అందరు వాహనదారుల మాదిరిగానే పోలీస్ సిబ్బంది తహసీల్దార్ ప్రయాణిస్తున్న కారును ఆపి డ్రైవర్‌కు డ్రంకెన్ డ్రైవ్ పరీక్ష చేశారు. ఈ క్రమంలో డ్రైవర్ వారితో దురుసుగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. కారులో ఉన్న తహసీల్దార్ అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో సీఐకి ఫోను చేయించినా వినిపించుకోలేదు. ఈ వ్యవహారంలో డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. గంటపాటు తహసీల్దార్ కారులోనే ఉండిపోయారు.
ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన


