గణతంత్ర వేడుకలకు సిద్ధం కావాలి
ఇబ్రహీంపట్నం రూరల్: గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టాల్స్, శకటాలు ఏర్పాటు చేయాలని, విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాలని అన్నారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు.
ప్రజావాణికి 33 ఫిర్యాదులు
ఈ వారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 33 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ చంద్రారెడ్డికి విన్నవించి అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అందించే వినతులను పెండింగ్‌లో పెట్టకుండా సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.


