గ్రామాభివృద్ధికి శిక్షణ కీలకం
శంషాబాద్ రూరల్: గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య సూచించారు. మండలంలోని ముచ్చింతల్ శివారు స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆవరణలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు సోమవారం నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు, ఆర్థిక వ్యవస్థ, పాలన విధానాలు, నిబంధనలు, నిర్వహణ అంశాల్లో పూర్తి పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. ఈ శిక్షణ గ్రామాభివృద్ధికి అత్యంత కీలకమని, ఇక్కడ నేర్చుకున్న అంశాలను అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఓ సురేశ్‌మోహన్, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, పంచాయతీ డైరక్టర్ పద్మజ తదితరులు పాల్గొన్నారు.


