ఓటరు జాబితాను సవరించండి
ఆమనగల్లు మున్సిపాలిటీకి
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ఆమనగల్లు: మున్సిపాలిటీ ఓటరు జాబితాలో తప్పులను 15 రోజుల్లో పరిశీలించి సవరించాలని హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పట్టణానికి చెందిన అడ్వకేట్ వస్పుల మల్లేశ్ మున్సిపాలిటీ ఓటరు జాబితాలో మరణించిన వారి పేర్లు ఉన్నాయని, ఒకే ఓటరుకు సంబంధించి రెండు ఓట్లు ఉన్నాయని, వాటిని తొలగించకుండా ఎన్నికలు నిర్వహించొద్దని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ ఈనెల 4న ఆమనగల్లు మున్సిపల్ కమిషనర్‌కు ఇచ్చిన పిటిషన్‌ను పరిశీలించి 15 రోజుల్లోగా ఓటరు జాబితాను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 9న నిర్వహిస్తామని తెలిపింది.


