సీహెచ్‌సీలో రోగుల కిటకిట
యాచారం: వాంతులు, విరేచనాలతో వచ్చిన రోగులతో యాచారం సీహెచ్‌సీ(సామాజిక ఆరోగ్య కేంద్రం) సోమవారం కిటకిటలాడింది. దాదాపు 250 మందికి పైగా రోగులు వచ్చారు. అందులో అత్యధికంగా వాంతులు, విరేచనాలు, జ్వరాలతో బాధపడుతున్న వారే. డాక్టర్ లలిత ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. షుగర్ మందులు లేక రోగులు ఇబ్బందులు పడ్డారు. రక్త నమూనాలు సేకరించి పరీక్షల కోసం వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి పంపిస్తున్నారు. సీహెచ్‌సీలో 24 గంటల పాటు వైద్యులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రోగులు కోరారు.


