సౌకర్యాలు అంతంత మాత్రమే
ఆమనగల్లు: పట్టణంలోని ప్రభుత్వాస్పత్రితో సరైన సౌకర్యాలు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం 250 మందికి పైగా ఔట్ పేషెంట్లు వస్తున్నారు. ఇటీవల పాత ఆస్పత్రిని కూల్చివేసి రూ.17.50 కోట్లతో నూతనంగా నిర్మి స్తున్నారు. దీంతో ఆస్పత్రి ఆవరణలో ఉన్న డాక్టర్ క్వార్టర్స్‌లో ఔట్ పేషెంట్లకు మాత్రమే చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లు మైమునాబేగం, జయశ్రీ, మంజులాదేవి రోగులకు వైద్యం చేస్తున్నారు. నిత్యం 20 నుంచి 30 మందికి రక్త పరీక్షలు నిర్వహించి వెంటనే రిపోర్టు అందిస్తున్నారు.


