వసతుల్లేక.. సేవలు అందక
రాత్రిపూట సేవలు బంద్
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో పీహెచ్‌సీలో పగటిపూటే సేవలు అందిస్తున్నారు. పూర్తి స్థాయిలో సిబ్బంది, పరికరాలు లేక పోవడంతో పీహెచ్‌సీలో ఉదయం 9 నుంచి సాయంత్రం వరకే వైద్య సేవలు అందుతాయి. ఆస్పత్రిలో ఇద్దరు రెగ్యులర్ డాక్టర్ పోస్టులు ఉండగా, ఒక్కరు డిప్యూటేషన్‌పై వెళ్లారు. డాక్టర్ కిరణ్‌కుమార్ రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. కుక్క, పాము కాట్లకు సైతం మందులు అందుబాటులో ఉన్నాయి. రోజుకు 60–70 మంది ప్రజలకు ఓపీ సేవలు అందిస్తున్నట్లు సిబ్బంది తెలిసింది. ఖాళీగా ఉన్న మూడు స్టాఫ్‌నర్స్ పోస్టులతో పాటు, రెగ్యులర్ డాక్టర్, స్వీపర్ పోస్టులను భర్తీ చేయాలి.
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులు అరకొర వైద్య సేవలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది కొరతతో నాణ్యమైన వైద్యం అందని ద్రాక్షలా మారుతోంది. సోమవారం సర్కారు వైద్యశాలలను ‘సాక్షి’ విజిట్ చేసింది. ఇందులో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. ఒక ఆస్పత్రిలో సమయం దాటినా వైద్యుడి కుర్చీ ఖాళీగా కనిపించింది. చాలా వైద్యశాలల్లో రక్త పరీక్షలు నిర్వహించే కేంద్రం లేకపోవడంతో హైదరాబాద్‌కు పంపిస్తున్నారు. దీంతో చికిత్స ఆలస్యం అవుతోందని రోగులు మదన పడుతున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇబ్బందులు పడుతున్న రోగులు
సరిపడా సిబ్బంది, గదులు, పరికరాలు లేని వైనం
అన్ని చోట్ల రక్త పరీక్షలు నిర్వహించాలని డిమాండ్
వసతుల్లేక.. సేవలు అందక
వసతుల్లేక.. సేవలు అందక


