లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
● సీఐటీయూ నేతల డిమాండ్
● కడ్తాల్‌లో ర్యాలీ, తహసీల్దార్‌కు వినతిపత్రం
కడ్తాల్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే ఉప సంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జిల్లెల పెంటయ్య డిమాండ్ చేశారు. కేంద్రంలోనీ బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు, వ్యవసాయ కూలీ, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. దీన్ని నిరసిస్తూ సీఐటీయూఐ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాఽధి హామీలో తీసుకువచ్చిన వికసిత్ భారత్– జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని, 2025 విద్యుత్ సవరణ చట్టాన్ని ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ కార్మికులకు పరిశ్రమల కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, లేబర్‌కోడ్స్ ఉప సంహరణ, రైతాంగ సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, ఉపాధి హమీ చట్టం పునరుద్ధరణ డిమాండ్లతో ఫిబ్రవరి 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. హమాలీ కార్మికులకు హెల్పర్ బోర్డు ఏర్పాటు చేసి ఇన్సూరెన్స్, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో తహసీల్దార్ జయశ్రీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో హమాలీ, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.


