పంచాయతీ కుట్రను అడ్డుకోండి
మహేశ్వరం: మండల పరిధిలోని సిరిగిరిపురం సర్వే నంబర్ 72, 73 ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు పంచాయతీ పెద్దలు కుట్ర చేస్తున్నారని వడ్డెర సంఘం నాయకులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ చిన్నప్పల నాయుడుకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తమ తాతల కాలం నుంచి ఈస్థలంలో ఖననాలు చేస్తున్నామని తెలిపారు. ఇటీవల పంచాయతీ పాలకవర్గ సభ్యులు, కార్యదర్శి తదితరులు శ్మశానవాటిక చుట్టూ ప్రీకాస్ట్ వాల్ నిర్మించారని తెలిపారు. ఎంపీడీఓ శైలజ, మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లుకు సైతం ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా శ్మశానవాటిక చుట్టూ ఉన్న నక్షబాట కబ్జా కాకుండా చూడటంతో పాటు రైతుల పొలాలకు వెళ్లేందుకు రోడ్డును వెడల్పు చేస్తున్నామని సర్పంచ్ తెలిపారు. కొంత మంది కావాలనే ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారన్నారు. రోడ్డు, ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా పంచాయతీ తీర్మానంతో బొందల చుట్టూ ప్రీకాస్ట్ వాల్ నిర్మించామని, ఇది గిట్టని వారు రాత్రి వేళ కూల్చివేశారని తెలిపారు. ఈ విషయమై తాము కూడా పోలీసులు, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశామన్నారు.
తహసీల్దార్‌కు వినతి


