వెంటనే రక్త పరీక్షల రిపోర్టు
షాద్‌నగర్: పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రి రోగులతో కిటకిటలాడుతుంది. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతూ నిత్యం 300 వందలకు పైగా ఓపీ పేషంట్లు వస్తున్నారు. రోగుల తాకిడికి సరిపడా సిబ్బంది లేరు. షాద్‌నగర్ గుండా జాతీయ రహదారి ఉండటంతో ప్రమాదాల బారిన పడిన క్షతగాత్రులు ఆస్పత్రికి వస్తున్నారు. ఆర్థోపెడిక్ సర్జరీలు ఇక్కడ అధికంగా నిర్వహిస్తున్నారు. ఆస్పత్రిలో సరిపడా మందుల నిల్వలు ఉన్నాయని, రోగులకు డయాలసిస్ సేవలు అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. రక్త పరీక్షలు చేసి ఎప్పటికప్పుడు రిపోర్టులు అందజేస్తున్నారు.


